Header Banner

బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టు గట్టి షాక్.. నకిలీ సర్టిఫికేట్ కలకలం! అక్కడే నిజం తేలాలి!

  Thu Apr 17, 2025 20:05        Politics

నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొందిన వైసీపీ కార్యకర్త, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అతడి తల్లి అనారోగ్యంతో ఉన్నట్లు ఇచ్చిన సర్టిఫికేట్‌పై రాత, సంతకం తనది కాదని లలితా సూపర్ స్పెషాల్టీ హాస్పటల్ వైద్యులు డాక్టర్ పివి రాఘవ శర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పోలీసులకు వైద్యుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను బోరుగడ్డ అనిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రాఘవశర్మ వాంగ్మూలాన్ని ఓ జ్యుడిషీయల్ ఫస్ట్ క్లస్ మేజిస్ట్రేట్‌తో రికార్డు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ఏపీ హైకోర్టు గురువారం ఆదేశించింది. అయితే ఇప్పటికే రికార్డు చేసి కోర్టు ముందుకు తెచ్చిన వైద్యుడి వాంగ్మూలం రికార్డును గుంటూరు జిల్లా ప్రదాన న్యాయమూర్తికి పంపాలని రిజిస్ట్రీని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక పిటిషనర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ నిర్ణయాన్ని వెల్లడించాలని బోరుగడ్డ అనిల్ తరుపు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు.

అయితే ఈ అభ్యర్దనను హైకోర్టు నిర్దంద్వంగా తొసిపుచ్చింది. ఈ నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంలో నిజానిజాలు తేలిన తర్వాతే బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఈ కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఇక బోరుగడ్డ అనిల్.. తన తల్లి గుండె సంబందిత వ్యాధితో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ గతంలో హైకోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో బెయిల్ కోసం నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నట్లు బోరుగడ్డ అనిల్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో తాను ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వలేదని లలితా సూపర్ స్పెషాల్టీ హస్పటల్ వైద్యులు డాక్టర్ పివి రాఘవశర్మ వెల్లడించారు. ఇక బోరుగడ్డ అనిల్‌పై కోర్టు దిక్కార చర్యలు ప్రారంభించాలంటూ అనుబంధ పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో పోలీసులు తాజాగా దాఖలు చేశారు.


ఇది కూడా చదవండివైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #BorugaddaAnil #FakeCertificateRow #HighCourtShock #AndhraPradeshNews #JudicialAction